గుండెకు బీట్‌రూట్‌ రక్ష

24-02-2018: ఆరోగ్యానికి బీట్‌రూట్‌ చేసే మేలు అంతా ఇంతా కాదు. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, ఊబకాయాన్ని తగ్గించేందుకు, మలబద్దకాన్ని నివారించేందుకు ఇలా ఎన్నో రకాలుగా సాయపడుతుంది. రక్తపోటును తగ్గించి గుండెకు రక్షగా ఉంటుంది. అంతేకాదు, గుండె వైఫల్యం చెందిన రోగులు తిరిగి కోలుకోవడానికీ బీట్‌రూట్‌ జ్యూస్‌లోని పోషకాలు ఉపయోగపడతాయని అమెరికాలోని ఇండియానా వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.