బాదంతో గుండె భద్రం!

14-11-2018: మధుమేహ రోగులు ఆహారంలో బాదం పప్పులు తీసుకుంటే గుండె జబ్బు వచ్చే ప్రమాదం నుంచి బయటపడొచ్చని తాజా అధ్యయనంలో గుర్తించారు. టైప్‌-2 మధుమేహ రోగులు రోజూ 20 కేలరీల బాదం పప్పులు తీసుకుంటే శరీరంలో కొవ్వు స్థాయిలు నియంత్రణలో ఉంటాయని గుర్తించారు. రోజూ 60 గ్రామలు బాదం పప్పులు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉండి, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని మరో అధ్యయనంలో తేలింది.