అతి నిద్ర గుండెకు చేటు!

14-06-2018: ‘అతి నిద్రా లోలుడు తెలివి లేని మూర్ఖుడు’ అన్నాడో కవి! అలా ఎక్కువ సేపు నిద్రపోతే గుండెకు ముప్పు అంటున్నారు నేటి పరిశోధకులు. దక్షిణ కొరియాకు చెందిన సియోల్‌ నేషనల్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అంశంపై చేసిన అధ్యయనంలో తేలింది ఇదే. ఎక్కువగా నిద్రపోతే గుండెకు ప్రమాదమని, హృదయ సంబంధ రుగ్మతలు వచ్చే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు షూగర్‌ కూడా వస్తుందని పేర్కొంటున్నారు. రోజుకు 6 గంటలకన్నా ఎక్కువ పడుకుంటున్న వారికి నడుం భాగం పెరిగిపోతుందని పరిశోధనలో గుర్తించారు. ఇక రోజుకు 10 గంటలకు పైగా పడుకొనే వారైతే రుగ్మతలను ఆహ్వానించినట్లేనని తేల్చేశారు.