విటమిన్‌ మాత్రలతో గుండెకు ముప్పు!

వాషింగ్టన్‌, జూలై 18: విటమిన్లు, మినరల్స్‌ మాత్రలతో మేలు కంటే కీడే ఎక్కువని అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. విటమిన్లు, మినరల్స్‌ను ఎక్కువగా తీసుకునే వారికి గుండె సంబంధితన జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువని వారు చెబుతున్నారు. విటమిన్‌-డీ, కాల్షియం ట్యాబ్లెట్లు కూడా హానికరమే అని భావిస్తున్నప్పటికీ.. అందుకు సంబంధించిన ఆధారాలేవీ లేవని వారు తెలిపారు. పరిశోధనల్లో భాగంగా గతంలో నిర్వహించిన 227 క్లినికల్‌ ట్రయల్స్‌ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 9 లక్షల మంది డేటాను వారు పరిశీలించారు. ఈ క్రమంలో వారు ఈ వివరాలను గుర్తించి, వెల్లడించారు.