ఈ అలవాట్లతో గుండెపోటు ముప్పు!

19-04-2019: ఉదయం టిఫిన్‌ చేయకపోయినా, రాత్రి ఆలస్యంగా భోజనం చేసినా గుండెపోటు ముప్పు ఎక్కువని తాజా సర్వే హెచ్చరిస్తోంది. రాత్రి భోజనానికి, నిద్రకు మధ్యలో 2 గంటల సమయం ఉండాలనేది సర్వే సారాంశం. ఇప్పటికే గుండెజబ్బుతో బాధపడుతున్న వారు ఈ జాగ్రత్తలు విధిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం టిఫిన్‌ చేయకపోతే 58% , రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే 51% ముప్పు అధికంగా ఉన్నట్లు పరిశోధనలో గుర్తించినట్లు ప్రివెంటివ్‌ కార్డియాలజీ అనే ఐరోపా జర్నల్‌లో ఓ అధ్యయనం ప్రచురితమైంది.