గుండె వైఫల్యం మహిళల్లోనే అధికం

17-07-2018: పురుషులతో పోల్చితే మహిళల్లోనే గుండె వైఫల్యంతో మరణించే ప్రమాదం అధికమని కెనడాలోని ఒట్టావా యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులతో మరణించే మహిళల్లో గుండె వైఫల్యంతో మరణించేవారే 35శాతం ఉన్నారు. ఐదేళ్లలో ఒంటారియోలో నమోదైన 90వేల గుండెవైఫల్య కేసులను పరిశీలించగా.. 47శాతం మహిళలే ఉన్నారు. వీరిలో వయసు పైబడినవారు, బలహీనంగా ఉన్నవారే ఎక్కువ.