వీడియో గేమ్స్‌తో గుండెకు వ్యాయామం

20-09-2018: వీడియో గేమ్స్‌ గుండెకు మంచి వ్యాయామం అని, వాటిని ఆడటం వల్ల గుండె సంబంధిత రోగాలు దరిచేరవని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్స్‌సకు చెందిన భారత సంతతి శాస్త్రవేత్త కవిత రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని బృందం.. వీడియో గేమ్స్‌ ఆడుతుండగా గుండె పనితీరును పరిశీలించగా రక్తసరఫరా బాగా జరిగినట్లు తేలింది. గుండెకు రక్తసరఫరా బాగా జరగటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండి, హృద్రోగాలు రావని పరిశోధకులు తెలిపారు.