ఫుడ్‌ ఫోబియాతో గుండెజబ్బు తీవ్రం

20-06-2019: కొత్త రకం ఆహార పదార్థాలను తినాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు. దీన్ని ‘ఫుడ్‌ నియోఫోబియా’ అంటారు. కొత్త వంటకాలు తినడానికి భయపడే వారికి గుండె జబ్బులు, టైప్‌-2 మధుమేహం వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని ఫిన్లాండ్‌లోని హెల్సింకి యూనివర్సిటీ, ఇస్తోనియాలోని తర్తు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. అధ్యయనంలో భాగంగా 25 నుంచి 74 ఏళ్ల మధ్య వయసున్న వారి ఆహారపు అలవాట్లను ఏడేళ్లపాటు పరిశీలించి పై నిర్ధారణకు వచ్చారు.