సహోద్యోగుల దుష్ప్రవర్తనతో హృద్రోగాలు

20-11-2018: సరిగ్గా పని చేయకపోతే బాస్‌లు కోప్పడటం, సహోద్యోగులు వెనకాల నవ్వుకోవడం మామూలే. కానీ ఇలాంటి సంఘటనలే ఉద్యోగుల ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. పని చేసే ప్రదేశాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే వారికి గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు తెలిపారు. మిగతా ఉద్యోగులతో పోల్చితే ఈ పరిస్థితులు ఎదుర్కొన్న వారిలో గుండెకు సంబంధించిన వ్యాధుల తీవ్రత 25% ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు.