బ్లూబెర్రీలతో గుండెజబ్బులు దూరం

19-06-2019: మారుతున్న జీవనశైలితో ప్రపంచంలో గుండెజబ్బులతో మరణిస్తున్నవారి రేటు ఎక్కువగానే ఉంది. దీనిపై శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు, అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీవారు నిర్వహించిన ఓ అధ్యయనంలో బ్లూబెర్రీలను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని వెల్లడైంది. ప్రతిరోజూ 150 గ్రాములు బ్లూబెర్రీలను తీసుకోవడం వల్ల దాదాపు 12 నుంచి 15 శాతం గుండెజబ్బుల రిస్కు తక్కువగా ఉంటుందంటున్నారు వారు. దాదాపు 6 నెలలపాటు 138 మంది ఊబకాయులమీద వీరు తమ స్టడీని నిర్వహించారు. సాధారణంగా మెటబాలిక్‌ సిండ్రోమ్ ఉన్నవారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే తమ అధ్యయనానికి వారిని ఎంచుకున్నామంటున్నారు. అయితే 150 గ్రాముల కంటే తక్కువ తీసుకున్నవారిలో మాత్రం ఎలాంటి ఫలితం కనిపించలేదట.