రూ. 7 వేలకే హృద్రోగాలను పసిగట్టే సెన్సర్‌ షీట్లు

24-09-2019: గుండె సంబంధిత వ్యాధులను పసిగట్టే డోజీ అనే సెన్సర్‌ షీట్లకు ఐటీ బాంబేకు చెందిన పరిశోధక విద్యార్థులు రూపకల్పన చేశారు. ఈ షీట్లు గుండె సంబంధిత వ్యాధులను వెంటనే పసిగడతాయి. వీటి తయారీకి కృత్రిమ మేధను ఉపయోగించారు. బెడ్‌కు ఈ షీట్లను అమర్చుకొంటే గుండె కొట్టుకొనే వేగంలో మార్పు, శ్వాస, ఒత్తిడి తదితరాలకు సంబంధించి వెంటనే సమాచారాన్నిస్తాయి. ఈ సమాచారం నేరుగా కేర్‌టేకర్లకు, డాక్టర్లకు చేరుతుంది. దీనివల్ల బాధితులకు కావాల్సిన వైద్యం వెంటనే అందించవచ్చు. ఈ సెన్సర్‌ షీట్ల వల్ల నిద్రలో గుండెపోటు మరణాలను నిరోధించవచ్చని పరిశోధకులు తెలిపారు.