‘టెస్టోస్టిరాన్‌’ చికిత్సతో గుండెపోటు!

21-07-2019: పురుషుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థను పెంపొందిస్తుంది టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌. శరీరంలో దీని స్థాయిలు తగ్గినవారు ఇటీవల కాలంలో టెస్టోస్టెరాన్‌ రీప్లే్‌సమెంట్‌ థెరపీ(టీఆర్టీ) చేయించుకుంటున్నారు. ఈ చికిత్స దీర్ఘకాలంలో గుండెపోటుకు దారితీస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. టెస్టోస్టిరాన్‌ తగ్గడంతో ప్రత్యుత్పత్తి వ్యవస్థతో పాటు, రోమాల పెరుగుదలపై ప్రభావం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ హార్మోన్‌ స్థాయిలను పెంచుకునేందుకు రీప్లే్‌సమెంట్‌ థెరపీ కొన్నేళ్ల క్రితమే అందుబాటులోకి వచ్చింది. ఈ థెరపీ చేయించుకున్న వారిని అధ్యయనం చేయగా వారు గుండెపోటు బారిన పడుతున్నట్లు గుర్తించారు. థెరపీ తర్వాత రెండేళ్లలోనే వారిలో ఆరోగ్య దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని వివరించారు. అధ్యయనంలో అమెరికా, బ్రిటన్‌లకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ చికిత్స వల్ల ప్రయోజనాలు స్వల్పమేనని తేల్చారు.