గుండె జబ్బు తీవ్రతను గుర్తించే పరికరం!

12-02-2019: కార్డియాక్‌ మాగ్నెటిక్‌ రెసోనన్స్‌ (సీఎంఆర్‌)తో ప్రాణాంతక గుండె జబ్బులను గుర్తించవచ్చని, అది ఎంత తీవ్రమైందో కూడా కనిపెట్టవచ్చని అమెరికాలోని డ్యూక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గుండెజబ్బుని గుర్తించే ఇతర పద్ధతులకు ఇది ప్రత్యామ్నాయం కాగలదని వారు పేర్కొన్నారు. ‘సీఎంఆర్‌ గుండెపోటు ప్రమాదాన్ని గుర్తిస్తుంది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వలన ఇది అంతగా వాడుకలో లేదు. మా అధ్యయనం సీఎంఆర్‌పై ఒక స్పష్టతనిస్తుంది’ అని పరిశోధనల్లో ఒకరైన రాబర్ట్‌ జడ్‌ తెలిపారు. గత పదేళ్లలో అమెరికాలోని ఏడు ఆస్పత్రుల్లో సీఎంఆర్‌ ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకున్న సుమారు 9వేలకు పైగా రోగుల డేటాను పరిశీలించిన శాస్త్రవేత్తలు అది గుండె జబ్బులను 3.4 రెట్లు కచ్చితత్వంతో గుర్తించిచినట్టు పేర్కొన్నారు.