ధూమపానంతో వినికిడి సమస్య

15-03-2018: ధూమపానంతో కేన్సర్‌ మాత్రమే కాదు వినికిడి సమస్య కూడా వచ్చే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. వైద్య పరీక్షల్లో భాగంగా ధూమపానం వల్ల ఎదురయ్యే సమస్యలను పరిశీలిస్తే పొగతాగే వారిలో వినికిడి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. జపాన్‌లోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌, మెడిసిన్‌ పరిశోధకులు 50వేల మందిపై పరిశోధనలు జరిపి దీనిని ధ్రువీకరించారు.