మలేరియా ఔషధంతో వినికిడి లోపం దూరం!

15-06-2019: జన్యుపరమైన లోపాలు లేదా వంశానుగతంగా పుట్టుకతో వచ్చే వినికిడి లోపాలను నివారించే శక్తి ‘యాంటీ మలేరియా ఔషధాల’కు ఉందని ఓ సర్వే పేర్కొంది. ఈ అంశంపై కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ యూనివర్సిటీ పరిశోధకులు జీబ్రాచేపలపై అధ్యయనం చేశారు. ఆర్టిమిసినిన్‌ అనే యాంటీ మలేరియా ఔషధాన్ని వాటిపై ప్రయోగించారు. దీని రసాయన శక్తి ప్రభావంతో చాలా చేపల్లో వినికిడి లోపాలు మటుమాయమైనట్లు గుర్తించారు.