ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆరోగ్యం

02-01-2019: పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా ఉండేవారు ఆరోగ్యంగా ఉంటారంటున్నారు నార్వే పరిశోధకులు. పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల కారణంగా నలుగురితో కలిసే అవకాశముంటుదనీ, అదే వీరిని ఆనందంగా ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడుతుందని వారు చెబుతున్నారు. ఒంటరిగా ఉండే వారిలో కనిపించే ఆరోగ్య సమస్యలు మచ్చుకు కూడా వీరిలో కనిపించవని అంటున్నారు. నలుగురితో కలవడం వలన ఒత్తిడి తగ్గి మెదడు చురుకుగా పనిచేస్తుందని వీరు స్పష్టం చేస్తున్నారు. పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వలన రోగ నిరోధకశక్తి పెరిగే అవకాశం కూడా ఉందని వీరు చెబుతున్నారు.