ప్రాసెస్డ్‌ మాంసాహారంతో ఆరోగ్య సమస్యలు

19-07-2018: రసాయనాలతో ప్రాసెస్‌ చేసిన సాలామిస్‌, హాట్‌డాగ్‌ వంటి స్నాక్స్‌ తీసుకొన్న వారిలో హైపరాక్టివిటీ, భ్రాంతిలో జీవించడం వంటి రుగ్మతలు కనిపిస్తున్నట్లు మాలిక్యులర్‌ సైక్రియాట్రీ అనే జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో తెలిపారు. నైట్రేట్‌ కలిగిన మాంసాహారం తీసుకొన్న వారిలో ఇటువంటి లక్షణాలు ఉంటున్నట్లు జాన్స్‌ హోప్కిన్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ఇలాంటి ఆహార పదార్థాలు నేరుగా మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. ప్రమాద తీవ్రతను తగ్గించే విధంగా ఆహార పదార్థాల ప్రాసెసింగ్‌పై పరిశోధనలు జరగాలని ఈ సర్వేలో పాల్గొన్న రాబర్ట్‌ యెల్కన్‌ తెలిపారు.