రోజూ 40 పుషప్స్‌.. గుండెకు మేలు!

18-02-2019: రోజుకు 40, అంతకన్నా ఎక్కువ పుషప్స్‌ చేసే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువని అమెరికాలోని హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గుండె జబ్బులను నిరోధించేందుకు ఈ పుషప్స్‌ పద్ధతి చాలా సౌకర్యం, ఖర్చులేనిదని తెలిపారు. 2000 నుంచి 2010 సంవత్సరాల మధ్య 1104 మంది హెల్త్‌ డేటాను పరిశోధకులు విశ్లేషించారు. వారి సగటు వయసు 39.6 సంవత్సరాలు కాగా.. సగటు బాడీ మాస్‌ ఇండెక్స్‌ 28.7గా ఉంది. పదేళ్ల కాలంలో నమోదైన గుండె సబంధింత జబ్బులను పరిశీలించారు. 40 పుషప్స్‌ కన్నా తక్కువ చేసే వారికి హృద్రోగాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తించారు.