కాఫీతో పేగులకు మేలు

21-05-2019: కాఫీ తాగడం వల్ల పేగు కదలికలు మెరుగవుతాయని తాజా అధ్యయనంలో తేలింది. పేగుల్లో చెడు బ్యాక్టీరియా వ్యాప్తిని అడ్డుకోవడంలో కాఫీ దోహదపడుతుందని తేల్చారు. గాజుపాత్రల్లో కాఫీకి చెడు బ్యాక్టీరియాను కలిపి ఎలుకలకు తాగించారు. ఆ బ్యాక్టీరియా అణచివేతకు గురవడంతోపాటు, ఎలుకల కండరాల్లో క్రియాశీలత పెరిగినట్టు గుర్తించారు. వరుసగా మూడు రోజులు కాఫీని అందించడం వల్ల ఎలుక పేగుల్లో శోషణ సామర్థ్యం, కండర కదలికలు మెరుగైనట్టు గుర్తించామని టెక్సాస్‌ యూనివర్సిటీ మెడికల్‌ బ్రాచ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జువాన్‌ ఝెంగ్‌ తెలిపారు. కాఫీలో ఉండే కెఫైన్‌ అనే పదార్థంతో సంబంధం లేకుండానే ఈ ఫలితాలు ఉన్నాయన్నారు.