బూట్లతోనే ఇంట్లోకి వెళ్తే ఊబకాయం

22-05-2018: ఇంట్లోకి బూట్లు వేసుకొనే వెళ్తున్నారా? వాటిని విప్పి ఇంట్లోనే ఓ మూలన ఉంచుతున్నారా? అలాచేస్తే ఊబకాయం ముప్పు ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పాదరక్షలతో ఇంట్లోకి వెళ్లినప్పుడు వాటిద్వారా వచ్చే పర్యావరణ కలుషితాలు, ఊబకాయాన్ని కలిగించే ఒబెసోజెన్స్‌ అనే రసాయనాలు ఆహారం, గాలి ద్వారా శరీరంలోకి వెళ్లి హార్మోన్ల తో కలిసి కొవ్వుస్థాయిలు పెంచుతాయని పోర్చుగల్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది.