అమ్మాయిలూ బీ కేర్‌ ఫుల్‌!

అతిగా మద్యం తాగితే ఎముకలు వీక్‌

లాస్‌ఏంజెల్స్‌, జూన్‌ 14: మద్యం ఎక్కువగా తాగే టీనేజ్‌ అమ్మాయిల్లో ఎముకలు పటుత్వం కోల్పోయే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. వెన్నుముకనూ దెబ్బతీస్తుందని అల్కహాల్‌ అండ్‌ డ్రగ్స్‌ స్టడీస్‌ అనే జర్నల్‌లో ప్రచురించిన సర్వేలో తెలిపారు. లయోలా మేరీమౌంట్‌ యూనివర్సిటీ ప్రతినిధులు ఈ అధ్యయనం నిర్వహించారు. వాస్తవానికి 18-20 ఏళ్ల వయస్సులో ఎముకలు పటిష్ఠ పడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మద్యం అదే పనిగా తాగితే ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు.