అబ్బాయిల కంటే అమ్మాయిలే శక్తిమంతులు

05-09-2018: ఇది నమ్మశక్యంగా లేకపోయినా, నూటికి నూరుపాళ్ళు నిజం అంటున్నారు పరిశోధకులు. అమ్మాయిలు శారీరకంగా శక్తిమంతులు కాకపోవచ్చుకానీ, మానసికంగా అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువ శక్తిమంతులన్న విషయం ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. శారీరకంగానే కాకుండా పలు విషయాలలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందుంటారని అధ్యయనకారులంటున్నారు. అబ్బాయిలు ఒకసారి ఒకపనిని మాత్రమే చేయగలిగితే అమ్మాయిలు ఒకేకాలంలో రెండు మూడు పనులు చేయగలుగుతారనీ వారు చెబుతున్నారు. ఆడవారితో పోలిస్తే మగవారిలో చెమట పట్టే గుణం ఎక్కువగానే ఉంటుందట! వీరి అధ్యయనంలో మరో ఆసక్తికరమైన అంశం వెల్లడైంది. జుత్తు ఉన్న మగవారితో పోలిస్తే జుత్తు పూర్తిగా లేని, లేదా బట్టతల ఉన్న మగవారు 13 శాతం ఎక్కువ శక్తిని కలిగిఉంటారట! అదే ఆడవారిలో అయితే జుత్తు పొడవుగా ఉన్న అమ్మాయిలు మానసికంగా చాలా దృఢంగా ఉంటారట! అన్ని విషయాలలోనూ వీరికి స్పష్టత ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా సాధించగలమన్న ధీమాతో ఉంటారట!