రోగనిరోధక శక్తిని దెబ్బతీసే ఫంగస్‌!

12-02-2019: భూమిపై విరివిగా లభించే సాధారణ ఫంగస్‌ (శిలీంధ్రం).. మన శరంలోని రోగనిరోధక వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేస్తుందో, ప్రాణాంతక ఇన్ఫెక్షన్లను ఎలా అభివృద్ధి చేస్తుందో జర్మనీలోని ఫ్రిడ్రిచ్‌ షిల్లర్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ముదురు బూడిద రంగులో ఉండే ఆస్పర్‌గిలస్‌ ఫుమిగాటస్‌ అనే ఈ ఫంగస్‌ ఎక్కువగా తడిగోడలపై ఉంటుంది. చిన్నచిన్న సూక్ష్మజీవులతో కలిసి గాలిని కలుషితం చేస్తుందని, ఇది మానవ శరీరంలోకి ప్రవేశిస్తే.. దీనివలన ఎయిడ్స్‌ రోగుల్లో మాదిరిగా రోగనిరోధక శక్తి దెబ్బతింటుందని, దీంతో ప్రాణానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. ‘ఆస్పర్‌గిలస్‌ ఫుమిగాటస్‌ అనేది రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల కణజాలం దెబ్బతిని రక్షణ వ్యవస్థ బలహీనమైపోతుంది’అని వెల్లడించారు.