నాలుగు కప్పుల కాఫీ మంచిదే!

13-03-2019: కాఫీ తాగడం మంచిదా? కాదా? అన్న అనమానం చాలా మందికి వస్తుంది. కాఫీ మంచిందంటూ ఒక పరిశోధన బయటకు వచ్చిన వెంటనే... కాఫీ తాగితే ఆరోగ్యం మీద ఆశ వదిలేసుకోవాలంటూ మరో పరిశోధన భయపెడుతుంది. ఈ వివాదానికి ముగింపు ఇచ్చేందుకు టెక్సాస్‌లోని ఓ సంస్థ నడుం బిగించింది. ఒక మోతాదు వరకు కాఫీ తాగితే అంత ప్రమాదం లేని ఆ సంస్థ అధ్యయనంలో తేలింది. రోజుకి దాదాపు 400 మిల్లీగ్రాముల వరకూ కెఫిన్‌ పుచ్చుకోవడం వల్ల వచ్చే నష్టమేమీ ఉండదట. ఇది దాదాపు నాలుగు కప్పుల కాఫీతో సమానం. గర్భిణీలూ కాఫీ తాగవచ్చు. అయితే వీరు 300 మిల్లీగ్రాములు కెఫిన్‌ లేదా మూడు కప్పుల కాఫీ మించి తాగకూడదని వారు స్పష్టం చేస్తున్నారు. పిల్లలను కెఫీన్‌కి వీలైనంత దూరంగా ఉంచాలని వారు హెచ్చరిస్తున్నారు. కాఫీ ఆరోగ్యానికి కొంత వరకూ మంచిదే అయినా మోతాదు మించితే మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు.