కారం ఎక్కువైతే మతిమరుపే!

14-08-2019: రోజువారీ ఆహారంలో కారం కాస్త ఎక్కువగా ఉపయోగిస్తే బోలెడన్ని ఆరోగ్య లాభాలు ఉంటాయన్న సంగతి గతంలో నిర్వహించిన పలు అధ్యయనాలు, పరిశోధనల ద్వారా రుజువైంది. కారం తినడం వలన ఆరోగ్య లాభాలతోపాటు ఆరోగ్య నష్టం కూడా ఉందన్న విషయం ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. రోజూ 50 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ కారాన్ని ఆహారం ద్వారా తీసుకుంటే మతిమరుపు వచ్చే ప్రమాదముందని అధ్యయనకారులు స్పష్టం చేస్తున్నారు. కారం ఎక్కువగా తినడం వలన శరీర బరువు తగ్గే మాట నిజమే అయినా, దానితో పాటు మతిమరుపు కూడా తగ్గే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు. రోజుకి 50 మిల్లీగ్రాముల లోపు తీసుకునేవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని వారంటున్నారు.