నీలిరంగు ప్లేటులో ఆహారం... బరువు తగ్గించే సులభ వ్యవహారం

24-02-2018: బరువు తగ్గేందుకు రోజుకొక నూతన విధానం పుట్టుకొస్తోంది. వీటివలన ప్రయోజనాలు ఎంతవరకూ ఉంటున్నాయో గానీ, తాజాగా బరువు తగ్గించే మరో విధానం నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. నీలిరంగు ప్లేటులో ఆహారం తింటే అత్యంత వేగంగా బరువు తగ్గుతారట. దీనికి సంబంధించిన కారణాలను కూడా నిపుణులు చెబుతున్నారు. పరిశోధకులు చెప్పినదాని ప్రకారం నీలి రంగు ప్లేటులో ఆహారం తీసుకోవడం వలన ఆకలి తగ్గుతుందట. దీంతో ఆహారం తక్కువగా తీసుకుంటారట. నీలిరంగు లేదా ఇతర డార్క్ కలర్స్ బ్రెయిన్‌పై అమితమైన ప్రభావం చూపిస్తాయి. దీంతో అటువంటి ప్లేటులో ఆహారం తీసుకున్నప్పుడు త్వరగా సంతృప్తి కలుగుతుందట. నీలిరంగు ప్లేటులో ఆహారం తీసుకోవాలనుకున్నప్పుడు దాని పరిమాణం చిన్నదిగా ఉండేలా చూసుకోవాలి. అయితే ప్లాస్టిక్ ప్లేటు వినియోగించడం మంచిదికాదని నిపుణులు సూచిస్తున్నారు.