కడుపులో మంట.. వణుకుడు తంట..

24-05-2018: జీర్ణాశయం సరిగా లేకపోతే మెదడుపై ప్రభావం పడి వణుకుడు రోగం వస్తుందట. అల్సర్‌, జీర్ణ కోశ వ్యాధులతో బాధపడేవారిపై డెన్మార్క్‌లోని ఫ్రెడిక్స్‌బర్గ్‌ హాస్పిటల్‌ వైద్యులు, ది రీసెర్చ్‌ లాబరేటరీ ఫర్‌ స్టీరియాలజీ అండ్‌ న్యూరోసైన్స్‌ శాస్త్రవేత్తలు దాదాపు 40 ఏళ్ల పాటు పరిశోధనలు చేయగా వారిలో 22 శాతం ఎక్కువగా వణుకుడు వచ్చినట్లు వెల్లడైంది.