ఉపవాసం మంచిదే!

20-02-2019: ఉపవాసం పరమ ఔషధమన్న విషయం  యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు నిర్వహించిన  అధ్యయనంలో స్పష్టమైంది. ఆహారం తీసుకోకపోవడం అనేది శరీరంలోని కాలేయం, కండరాలపై ప్రభావం చూపుతుందనీ, ఇది జీవక్రియల ప్రక్రియను మరింత దృఢపరుస్తుందని వారు చెబుతున్నారు. ఎలుకలకు 24 గంటలపాటు ఆహారం ఇవ్వకుండా వాటి శరీర స్థితిని పరిశీలించారు.  మునుపటి కన్నా అవి చురుకుగా ఉండడాన్ని గుర్తించారు. అయితే ఊపిరి తీసుకోవడంలో కొద్దిపాటి ఇబ్బందులెదుర్కొన్నా ఆహారం తీసుకున్న వెంటనే వాటికి ఆ సమస్య తీరిందన్నారు, నెలలో ఒకసారన్నా నిరాహారంగా ఉండడం వలన మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే గుండెజబ్బు ఉన్నవారు, షుగర్‌ పేషెంట్లు ఉపవాసం విషయంలో వైద్యులను సంప్రదించాలని వారు సూచిస్తున్నారు.