నిమ్మరసంతో మార్నింగ్ మంత్ర

న్యూఢిల్లీ: ఒక కప్పు హాట్ కాఫీ లేదా గరం చాయ్‌తో మన దినచర్య మొదలవుతుంది. కాఫీ, లేదా టీ అనేవి నిద్ర మత్తును వదిలించి యాక్టివ్‌గా చేస్తాయి. అయితే ఆరోగ్యపరంగాచూస్తే ఇంతకంటే మంచి డ్రింక్స్ తీసుకోవడం మేలుచేస్తుంది. ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో కొంచం నిమ్మ రసం కలుపుకొని తాగితే బహుళ ప్రయోజనాలున్నాయి. నిమ్మలో ఉండే అల్కలైన్ లక్షణాలు శరీరంలోని మాలిన్యాలను నిర్మూలించే సాధనంగా పనిచేస్తాయి. గోరువెచ్చటి నిమ్మ రసాన్ని పరగడుపున తీసుకుంటే శరీంలోని గ్యాస్ట్రో‌సిస్టం మెరుగు పడుతుంది. ఫలితంగా శరీరంలో న్యూట్రిషన్లు, ఇతర మినరల్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది. నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ప్రత్యేక ఫైబర్ పదార్థం వలన.. ఇది బరువు తగ్గలనుకునే వారికి దివ్య ఔషదం లాంటిది. దీంతో మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. ముందు రోజు మసాలాలు, జంక్‌ఫుడ్ లాంటివి తినివుంటే ఉంటే అవన్నీ క్లీన్ అయి కడుపు ఉబ్బరం, అల్సర్లు లాంటివి రాకుండా ఉంటాయి. పొద్దున్నే ఒక గ్లాసు నిమ్మ రసం తాగడం వలన కడుపు శుభ్రపడి ప్రశాంతతను చేకూరుస్తుంది.