తాగుడు.. స్త్రీల కన్నా మగాళ్లకే ఎక్కువ హానికరం

లండన్‌, సెప్టెంబరు 4: అధికంగా మద్యపానం సేవించడం స్త్రీల కన్నా పురుషులకే ఎక్కువ హానికరమట. ఎక్కువకాలం నుంచి తాగుడుకు అలవాటు ఉన్న స్త్రీ, పురుషుల్లో మెదడు పనితీరు భిన్నంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. నిత్యం మద్యం సేవించే అలవాటున్న 11 మంది యువకులు, 16 మంది యువతుల్లో ఎలక్ట్రోఎన్సుఫలోగ్రాం(ఈఈజీ) సాయంతో మెదడు స్పందనలను పరీక్షించగా యువకుల మెదడులో ఎక్కువ మార్పులు సంభవించినట్లు, విద్యుత్‌ కార్యకలాపాలు ఎక్కువైనట్లు వెల్లడైంది. తాగుడు వల్ల విద్యుత్‌, రసాయన నాడీ ప్రసరణ యువకుల్లో యువతుల కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలిందని ఫిన్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ వెస్టర్న్‌, కుపియో యూనివర్సిటీ హాస్పిటల్‌ వైద్యులు తెలిపారు.