బ్రేక్‌ఫాస్ట్‌ మానేసినా బేఫికర్‌!

20-02-2019: బ్రేక్‌ఫాస్ట్‌ తినకపోతే బరువు పెరుగుతారనీ, తింటే తగ్గుతారన్న మాటలలో నిజంలేదంటున్నారు ఆస్ట్రేలియా పరిశోధకులు. ఈ విషయం మీద గత పదమూడు సంవత్సరాలలో దాదాపు 28 సార్లు అధ్యయనాలు చేశారు. బ్రేక్‌ ఫాస్ట్‌ తినని వారి కన్నా తిన్న వారిలో రోజు మొత్తం మీద 260 కేలరీలు ఎక్కువగా ఖర్చుఅవుతాయన్న విషయాన్ని వీరు గుర్తించారు,. అంతేకాకుండా తిన్నవారిలోనూ, తినని వారిలోనూ బరువు హెచ్చుతగ్గులు స్వల్పంగా ఉన్నాయని వీరు చెబుతున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌ తినని వారు వారంలో స్వల్పంగా అంటే దాదాపు 50 గ్రాములు బరువు తగ్గడాన్ని గమనించారు. అదే విధంగా బ్రేక్‌ఫాస్ట్‌ తింటే చురుకుగా పనిచేస్తారన్న వాదనను వారు కొట్టిపారేశారు. తిన్నవారు, తినని వారు కూడా సమానంగా పనిచేస్తారని అంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌ తిన్నవారు మధ్యాహ్న భోజనం తక్కువ తింటారన్న విషయాన్ని కూడా వీరు నిర్ధారించలేదు.