గంటకు మించి టీవీ చూడొద్దు

ఐదేళ్లలోపు చిన్నారులకు డబ్ల్యూహెచ్‌వో సూచన

యునైటెడ్‌ నేషన్స్‌, ఏప్రిల్‌ 25: చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదల, ఆరోగ్యానికి తొలి ఐదేళ్లు ఎంతో ముఖ్యం. అలాంటి ఎదుగుదలకు ఎలక్ర్టానిక్‌ పరికరాలు అడ్డుపడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ఆడుకోవాల్సిన వయసులో పిల్లలు గంటల తరబడి టీవీ, సెల్‌ఫోన్లు చూస్తూ, గేమ్‌లు ఆడుతూ గడపడం వలన ఊబకాయ సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంది. తద్వారా పిల్లలు శారీరక దృఢత్వాన్ని కోల్పోతున్నారని తెలిపింది.