కాఫీతో మధుమేహం ముప్పు దూరం

14-11-2018: మీకిష్టమైన కప్పు కాఫీ తాగండి చాలు...టైప్ 2 మధుమేహం ముప్పు నుంచి మూరు బయటపడతారని పరిశోధకులు చెపుతున్నారు. బెర్లిన్ నగరంలో ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ ఇన్ ఫర్మేషన్ ఆన్ కాఫీ, యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెట్స్ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల ప్రపంచస్థాయి సమావేశంలో కాఫీపై జరిపిన పరిశోధనలపై చర్చించారు. కాఫీ తాగడం వల్ల టైప్ 2 మధుమేహం ముప్పు నుంచి దూరమవవచ్చని అసోసియెట్ ప్రొఫెసర్ మట్టీస్ కార్ల్ ట్రామ్ వెల్లడించారు. తాము 1,185,210 మందిని పరిశీలించగా ఈ విషయం వెలుగుచూసిందని చెప్పారు. రోజుకు మూడు, లేదా నాలుగు కప్పుల కాఫీ తాగితే టైపు2 మధుమేహం ముప్పు 25 శాతం రాదని తమ పరిశోధనల్లో తేలిందని ప్రొఫెసర్లు చెప్పారు.