ఏఐతో కంటి వ్యాధుల నిర్ధారణ!

20-03-2019: వ్యాధుల్ని వేగంగా, కచ్చితంగా నిర్ధారించడంలో కంటి వైద్యులకు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) సహాయ పడుతుందని గూగుల్‌ ఏఐ రిసెర్చ్‌ బృందం వెల్లడించింది. భవిష్యత్తులో వైద్యుల స్థానాన్ని అది భర్తీ చేస్తుందని పేర్కొంది. తాజా అధ్యయనంలో పరిశోధకులు గణాంకాలను పరిగనణలోకి తీసుకున్నారు. కంప్యూటర్‌ సహాయక వ్యవస్థతో ఆ గణాంకాలను విశ్లేషించి వ్యాధిని కచ్చితత్వంతో నిర్ధారించారు. ఇది కంటి వైద్యుల వ్యాధి నిర్ధారణ కచ్చితత్వాన్నే కాకుండా.. గణాంకాల కచ్చితత్వాన్ని కూడా మెరుగుపరిచిందని పరిశోధకులు గుర్తించారు.