కిడ్నీ వ్యాధులతో మధుమేహం!

13-12-2017: మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం, తదితర ఇబ్బందులుండే వారికి మధుమేహం వచ్చే ముప్పు ఉందని తాజా అధ్యయనంలో తేలింది. దీనికి కారణం యూరియాతో సంబంధమేనని వెల్లడైంది. ఇప్పటిదాకా మధుమేహం వల్ల కిడ్నీ పాడవుతుందని మాత్రమే తెలుసునని, కిడ్నీల వల్ల కూడా మధుమేహం వస్తుందని తమ తాజా పరిశోధనల్లో తేలిందని అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా మూత్రపిండాలు రక్తం నుంచి యూరియాను తొలగిస్తాయని, ఒకవేళ మూత్రపిండాలు పనిచేయడం తగ్గిపోతే రక్తంలో యూరియా శాతం పెరిగి మధుమేహానికి దారితీస్తాయని వివరించారు