మానసిక ఒత్తిడి ఉద్యోగాలతో మధుమేహం!

19-03-2019: మానసికంగా ఎక్కువ అలసిపోయే ఉద్యోగాలు చేసే మహిళలకు టైప్‌-2 మధుమేహం వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో గుర్తించారు. ఈ మేరకు ‘యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఎండోక్రినాలజీ’లో ఆ వివరాలను ప్రచురించారు. పరిశోధనల్లో భాగంగా సుమారు 70 వేల మంది మహిళా ఉద్యోగులను 22 ఏళ్లపాటు వారు పరిశీలించారు. పని ఒత్తిడి ఉద్యోగుల మానసిక స్థితిపై ఏమేరకు ప్రభావం చూపుతుందో గమనించారు. అయితే మానసికంగా అలసిపోయే ఉద్యోగుల్లో 75 శాతం మంది టీచింగ్‌ వృత్తిలో ఉన్నట్టు తేలింది. వారిలో 24 శాతం మంది తమ ఉద్యోగం వలన తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని వెల్లడించారు. ఇలా మానసికంగా అలసిపోయే మహిళలకు టైప్‌-2 మధుమేహం వచ్చే ప్రమాదం 21ు ఎక్కువగా ఉన్నట్టు వారు గుర్తించారు.