మైదాపిండితో మధుమేహం?

05-09-2018: మైదాపిండితో చేసే ఆహార పదార్థాలను తింటే మధుమేహం తప్పదని తాజాగా చేసిన పరిశోధనలో తేలింది. ఈ పిండిలో కార్బోహైడ్రేట్లు అధికస్థాయిలో ఉంటాయి. పోషకాలు కూడా తక్కువ మోతాదులో ఉంటాయి. మైదాలో గ్లైకామిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈ పిండితో చేసిన పదార్థాలు జీర్ణంకాక మన పేగులకూ అలాగే అతుక్కుపోతాయి. దీంతో పేగుల్లో క్రిములు ఉత్పత్తి అయి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. మైదా పిండితో తయారు చేసిన వంటకాలను తీసుకోవడం వలన దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ అంటున్నారు పరిశోధకులు. కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాలో ప్రొటీన్లు నామ మాత్రంగా ఉంటాయి.