విటమిన్‌-డీ లోపంతో మధుమేహం!

21-04-2018: విటమిన్‌-డీ లోపంతో చికాకు, నిద్ర మబ్బు, బీపీ, దీర్ఘకాలిక తలనొప్పి, కండరాలు, ఎముకల బలహీనత, తదితర సమస్యలు తలెత్తుతాయని తెలుసు. అయితే, మధుమేహం కూడా వచ్చే ప్రమాదం ఉందని అమెరికాలోని శాన్‌ డియాగో వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రక్తంలో 25-హైడ్రాక్సివిటమిన్‌-డీ స్థాయి 30 ఎన్‌జీ/మిల్లీలీటర్‌ కంటే తక్కువ ఉంటే మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.