మూల కణ చికిత్సతో మధుమేహం రివర్స్‌

17-11-2017: ‘మధుమేహాన్ని అదుపులో పెట్టగలం. దాన్ని తగ్గించలేం.’ అన్న మాటకు ఇక స్వస్తి పలికే రోజులు దగ్గరపడ్డాయి. ఎందుకంటే, టైప్‌-1 మధుమేహాన్ని మొత్తంగా తగ్గించే మూల కణ చికిత్సను అమెరికాలోని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. టైప్‌-1 మధుమేహం వచ్చే రోగుల్లో పీడీ-ఎల్‌1 అనే ప్రొటీన్‌ తక్కువగా ఉంటుంది. ఆ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసే మూలకణాలను శరీరంలోకి చొప్పించి తద్వారా ఎలుకల్లో ఈ వ్యాధిని తగ్గించగలిగారు. పలు రసాయనాలను కలిగిన ఈ మూల కణాలు శరీరంలోని కణాల స్వయంరక్షక ప్రతిచర్యలను అదుపులో పెట్టి చక్కెర వ్యాధి(హైపర్‌ గ్లైసీమియా)ని తగ్గించాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.