పండ్లరసాలతో మధుమేహం రాదు

21-01-2018: పండ్లరసాలను చూడగానే నోరూరుతుంది. కానీ వీటిని తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని మధుమేహ వ్యాధిగ్రస్తులు వాటి జోలికి వెళ్లరు. అయితే, వారు ఎలాంటి సంకోచం లేకుండా పండ్లరసాలు తాగొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. రక్తంలోని గ్లూకోజ్‌, ఇన్సులిన్‌ స్థాయిలపై ఇతర పదార్థాలేవీ కలపని పండ్లరసాలు ప్రభావం చూపవని చెబుతున్నారు. ఈ మేరకు జర్నల్‌ ఆఫ్‌ న్యూట్రిషనల్‌ సైన్స్‌లో ఓ కథనం ప్రచురితమైంది.