పేగు బ్యాక్టీరియాతో కుంగుబాటు!

19-06-2018: పేగు బ్యాక్టీరియా(గట్‌ బ్యాక్టీరియా) కారణంగా మధుమేహం, ఊబకాయం వస్తుందని ఇప్పటికే పరిశోధనల్లో తేలింది. ఈ బ్యాక్టీరియాతో కుంగుబాటు, ఆందోళనకు గురయ్యే అవకాశం కూడా ఉందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. అమెరికాలోని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధకులు ఎలుకలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.