సోషల్‌మీడియాతో కుంగుబాటు

25-05-2019: మానసిక కుంగుబాటు(డిప్రెషన్‌). దీని కారణంగా ఏటా ఎంతోమంది చేతులారా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఒతిళ్లు, ఓటమి భయం, ఆత్మన్యూనతా భావం కారణంగానే సగటు మనిషి మానసిక కుంగుబాటునకు గురవుతున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. వీటితో పాటు ‘సోషల్‌మీడియా’ కూడా డిప్రెషన్‌ వ్యాప్తిలో ముఖ్య కారణ‘భూతం’గా మారిందని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉదాహరణ ఒక సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఓ వ్యక్తికి 150 మంది స్నేహితులు ఉన్నారని అనుకుందాం. వారందరినీ కలుపుకొని ఒక చిన్న గ్రామంగా ఊహించుకుంటే.. అందులో నివసించే ప్రతికూల దృక్పథం కలిగిన నెటిజన్ల పోస్టులు, కామెంట్లు, లైకులు వారి అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి. ఇవి కూడా ఓ సగటు వ్యక్తి మానసికంగా కుంగిపోవడానికి ఊతమిచ్చే అవకాశం లేకపోలేదని నిపుణులు అంటున్నారు.