పసుపుతో కుంగుబాటుకు చెక్‌!

30-08-2019: మన వంట గదిలో ఉండే పసుపు మంచి యాంటీబయాటిక్‌గా పని చేస్తుందన్న సంగతి చాలా మందికి తెలిసిన విషయమే. కానీ, అదే పసుపు.. మనల్ని కుంగుబాటుకు దూరంగా కూడా ఉంచుతుందంటున్నారు పరిశోధకులు. ఈ విషయం తమ పరిశోధనలో తేలిందని రుసాన్‌ ఫార్మా సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ సాగర్‌ కరియా వెల్లడించారు. దీర్ఘకాలికంగా మనలో ఉన్న బాధ.. తీవ్రమైన కుంగుబాటు, మానసిక సమస్యలకు దారి తీస్తుందని తెలిపారు. అయితే, పసుపులో ఉండే పాలీఫినాల్‌ కుర్కుమిన్‌ అనే ఔషధం.. ఆ ప్రమాదం నుంచి బయటపడేస్తుందని చెప్పారు. కుర్కుమిన్‌, దానితో పాటు పసుపులో ఉండే ఇతర ఔషధ గుణాలు కలిసి.. కేన్సర్‌, గుండె జబ్బులు వంటి ప్రమాదకర అనారోగ్యాల నుంచి మనల్ని రక్షిస్తాయని చెప్పారు.