బ్రెస్ట్‌ ఫీడింగ్‌తో డిప్రెషన్‌ దూరం!

06-02-2019: బిడ్డకు పాలివ్వడం బిడ్డకే కాకుండా తల్లికీ మంచిదన్న సంగతి తెలిసిందే! ఎక్కువ కాలం బిడ్డకు పాలిచ్చే తల్లి భవిష్యత్తులో డిప్రెషన్‌కి లోనయ్యే అవకాశాలు చాలావరకు తగ్గిపోతాయంటున్నారు అమెరికా యూనివర్సిటీకి చెందిన అధ్యయనకారులు. 40 నుంచి 50 సంవత్సరాలు పైబడిన తల్లుల మీద వీరు సుదీర్ఘకాలం పాటు అధ్యయనం నిర్వహించారు. వీరిలో కొందరు తల్లులు తమ పిల్లలకు అస్సలు పాలివ్వలేదు. మరికొందరు ఏడాది నుంచి రెండు సంవత్సరాల పాటు పాలిచ్చారు. 50 సంవత్సరాల వయస్సులో వారి ఆరోగ్యాన్ని అధ్యయనకారులు పరిశీలించారు. ఎక్కువ కాలం పాలిచ్చిన తల్లుల్లో తొమ్మిది శాతం మందిలో మాత్రమే డిప్రెషన్‌ లక్షణాలు గుర్తించారు. అస్సలు పాలివ్వని వారు దీర్ఘకాలం నుంచి డిప్రెషన్‌కు లోనయిన సంగతి గమనించారు. పాలిచ్చే తల్లుల్లో ఆక్సిటొసిన్‌ హార్మోన్‌ విడుదలవుతుందనీ, ఈ హార్మోన్‌ మానసిక ప్రశాంతతకి దోహదం చేస్తుందనీ వారు అంటున్నారు.