ధూమపానంతో చిత్తవైకల్యం

14-06-2018: ఎక్కువగా పొగ తాగుతున్నారా? షుగర్‌ నియంత్రణలో ఉండటం లేదా? అయితే భవిష్యత్తులో చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం ఉందంటోంది తాజా అధ్యయనం. సిగరెట్‌ అలవాటు లేదా షుగర్‌ ఉన్న వారి మెదడులో జ్ఞాపకశక్తికి కీలకమైన ప్రదేశంలో కాల్షియం నిక్షేపాలు పెరుగుతున్నట్లు గుర్తించారు. ఇవి వృద్ధి చెందుతుండటం ప్రమాదకరమని నెదర్లాండ్స్‌కు చెందిన యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌ ప్రతినిధులు చెబుతున్నారు. 1991 మంది రోగులపై పరిశోధన చేసి ఈ నిర్ధారణకు వచ్చారు.