ఫిట్‌నెస్‌తో మహిళల్లో చిత్తవైకల్యం దూరం

16-03-2018: మధ్య వయసులో ఉన్నపుడు మహిళలు శారీరకంగా దృఢంగా ఉంటే.. వారిలో చిత్తవైకల్యం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందట. సాధారణ మహిళలతో పోలిస్తే ఫిట్‌గా ఉండే మహిళల్లో చిత్తవైకల్యం రావడం 11 ఏళ్లు ఆలస్యమవుతుందన్నారు గొథెన్‌బర్గ్‌ యూనివర్సిటీ పరిశోధకులు. శారీరకంగా దృఢంగా ఉన్న మహిళల్లో చిత్తవైకల్యం వచ్చే అవకాశం 90% తగ్గినట్లు గుర్తించామన్నారు.