పనెక్కువైతే ప్రాణాలకే ముప్పు!

12-03-2019: ఇది ఎక్కువ గంటలు పనిచేసే స్త్రీలకు వర్తిస్తుందంటున్నారు పరిశోధకులు. స్త్రీలు ఇంటా బయటా పురుషులకన్నా ఎక్కువ గంటలు పనిచేయడం వలన వారి జీవితకాలం తగ్గిపోతోదంటున్నారు ఓహ్రియో యూనివర్సిటీ పరిశోధకులు. వారంలో 40 గంటలకు మించి పనిచేసే మహిళల్లో మధుమేహం, కేన్సర్‌, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 30 శాతం వరకూ ఉంటుందన్న విషయం వీరి పరిశోధనలో వెల్లడైంది. వారానికి 60 గంటలు పనిచేసే మహిళల్లో ఈ ముప్పు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందంటున్నారు. అయితే ఈ ప్రమాదం పురుషుల్లో అంతగా ఉండదని వారు చెబుతున్నారు. ఇంటా బయటా పని చేసే స్త్రీలు రోజుకు ఎనిమిది నుంచి పదిగంటల పాటు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకుంటే పై సమస్యల నుంచి కొంత వరకూ తప్పించుకోవచ్చని వారు సూచిస్తున్నారు.