అతిగా మాంసం తింటే కాన్సర్‌?

14-02-2018: అతి ఎప్పటికీ అనర్ధదాయకమే! అన్న విషయం మరోసారి రుజువైంది. ఎక్కువగా మాంస పదార్థాలు తీసుకునేవారు, శీతలపానీయాలు ఎక్కువగా తాగే వారిలో పెద్ద పేగు కాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న విషయం ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. సుమారు లక్షా 30 వేలమంది ఆహారపు అలవాట్ల మీద 26 సంవత్సరాల పాటు సుదీర్ఘ అధ్యయనాన్ని నిర్వహించారు. ఎక్కువగా మాంసం తీసుకునేవారిలోనూ, అతిగా శీతల పానీయాలు తాగే వారిలోనూ పెద్ద పేగు కాన్సర్‌ లక్షణాలను వీరు గుర్తించారు. వీరే కాకుండా అతిగా శుద్ధిచేసిన ధాన్యం తీసుకున్నవారికి కూడా ఈ ముప్పు పొంచి ఉంటుందని వీరు చెబుతున్నారు. మాంసం ఎక్కువగా తీసుకునే వారందరికీ పెద్దపేగు కాన్సర్‌ వచ్చే అవకాశం ఉందా? అన్న విషయాన్ని మాత్రం వీరు నిర్థారించలేదు.