ప్రమాదకరంగా నాడీ సంబంధ వ్యాధులు

15-10-2017: అల్జీమర్స్‌, వణుకుడు, మూర్ఛ రోగాలతో మరణాలు ఎక్కువవుతున్నాయని, గత 25 ఏళ్లలో ఆ సంఖ్య 36% పెరిగిందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. చాలామంది ఈ వ్యాధులతో వైకల్యం బారిన పడ్డారనీ వెల్లడించారు. దీనికంతటికి దీర్ఘ ఆయుర్దాయమే కారణమని రష్యాలోని నేషనల్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ హైయర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ పరిశోధకులు తెలిపారు. ఎక్కువ ఆదాయం, తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లోనే ఈ కేసులు నమోదవుతున్నట్లు వివరించారు.