రోజూ యోగాతో వీర్య నాణ్యత మెరుగు!

20-10-2018: ప్రతి రోజూ యోగా చేయడం వలన పురుషుల్లో వీర్య కణాల డీఎన్‌ఏలో నాణ్యత పెరుగుతుందని ఢిల్లీ ఎయిమ్స్‌ పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. తద్వారా బలహీనమైన వీర్యకణాల వలన పిండం సరిగా ఎదగకపోవడం వంటి సమస్యలు తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు. ఎయిమ్స్‌లోని శరీరనిర్మాణశాస్త్ర, ప్రసూతి, గైనకాలజీ విభాగాలు సంయుక్తంగా 60 జంటలపై 90 రోజులపాటు పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని నిర్ధారించారు.